Skip to main content

ఎస్వాతీని దేశ ప్రధాని ఆంబ్రోస్ మాండ్వు కన్నుమూత

ఆఫ్రికా ఖండంలోని ఎస్వాతీని దేశ ప్రధాని ఆంబ్రోస్ మాండ్వులో లామిని (52) కన్నుమూశారు.
Current Affairs
ఇటీవలే కరోనా వైరస్ బారిన పడిన ఆయన దక్షిణాఫ్రికాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 13న తుదిశ్వాస విడిచారు. బ్యాంకింగ్ రంగంలో పనిచేసిన ఆంబ్రోస్ 2018, అక్టోబర్ 27న ఎస్వాతిని దేశ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. పోలాండ్‌లోని కటోవిస్ నగరంలో జరిగిన ప్రపంచ సదస్సులో వాతావరణ మార్పులపై ఆయన ప్రసంగించారు.

గతంలో స్వాజిలాండ్...
గతంలో స్వాజిలాండ్ అని పిలిచే ఎస్వాతిని దేశంలో సంపూర్ణ రాచరిక ప్రభుత్వం అధికారంలో ఉంది. 11 లక్షలకు పైగా జనాభా కలిగిన ఈ దేశంలో ఇప్పటి వరకు 6700కు పైగా కరోనా కేసులు నమోదవగా, 127 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఎస్వాతీని పరిపాలన రాజధాని: ఎంబబానె;
ఎస్వాతీని శాసన రాజధాని: లోబాంబ
ఎస్వాతీని కరెన్సీ: స్వాజి లిలాంగేనీ, సౌత్ ఆఫ్రికన్ రాండ్
ఎస్వాతీని ప్రస్తుత రాజు: ఎమ్‌స్వతి-III(Mswati III)

క్విక్ రివ్యూ
:
ఏమిటి : ఎస్వాతీని దేశ ప్రధాని కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : ఆంబ్రోస్ మాండ్వులో లామిని
ఎక్కడ : దక్షిణాఫ్రికా
ఎందుకు : కరోనా వైరస్ కారణంగా
Published date : 14 Dec 2020 05:50PM

Photo Stories