Skip to main content

ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఆదేశాలు ఉపసంహరణ

షెడ్యూల్ కులాలు, తెగల (ఎస్సీ, ఎస్టీ) వేధింపుల నిరోధక చట్టం నిబంధనలను సడలిస్తూ 2018లో ఇచ్చిన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది.
ఈ మార్గదర్శకాలను సమీక్షించాలంటూ కేంద్రప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం అక్టోబర్ 1న విచారణ జరిపింది. 2018 ఏడాది మార్చి 20వ తేదీన ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన ఈ మార్గదర్శకాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తాజాగా కోర్డు పేర్కొంది. అందుకే ఈ ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నామని వివరించింది. ఎస్సీ, ఎస్టీ ప్రజలు సమాజంలో సమానత్వం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారని, అంటరానివారుగా, వేధింపులకు, సామాజిక బహిష్కరణలకు గురవుతున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ అధికారులను వేధిస్తున్నారంటూ అభిప్రాయపడిన సుప్రీంకోర్టు 2018 ఏడాది మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం ప్రభుత్వ అధికారులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదయ్యే కేసుల్లో తక్షణమే అరెస్టులకు పూనుకోకుండా ఆరోపణల్లో వాస్తవాలను ముందుగా డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేయించాలని పేర్కొంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఆదేశాలు ఉపసంహరణ
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : ఆదేశాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని
Published date : 02 Oct 2019 04:49PM

Photo Stories