Skip to main content

ఎస్‌పీవో–2 ఆక్సిజన్‌ డెలివరీ సిస్టమ్‌ను అభివృద్ధి చేసిన ప్రభుత్వ సంస్థ?

సరిహద్దులోని పర్వత ప్రాంతాల్లో గస్తీ కాసే సైనికులకు ఆక్సిజన్‌ అందించేందుకు డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ‘‘ఎస్‌పీవో–2 సప్లిమెంటల్‌ ఆక్సిజన్‌ డెలివరీ సిస్టం’’ అనే పరికరం కరోనా బాధితులకు వరంగా మారనుంది.
Current Affairs
బెంగళూరులోని డీఆర్‌డీవోకు చెందిన ‘ది డిఫెన్స్‌ బయో ఇంజినీరింగ్‌ అండ్‌ ఎలక్ట్రో మెడికల్‌ లేబొరేటరీ’ తయరుచేసిన చేసిన ఈ పరికరంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.

ఎస్‌పీవో–2 పరికరం: ప్రత్యేకతలు
  • ఆక్సిజన్‌ సిలిండర్‌కు అనుసంధానమై ఉండే ఈ పరికరం రక్తంలోని ఆక్సిజన్‌ నిర్ణీత మోతాదు కంటే తక్కువైన వెంటనే తనంతట తానే ఆక్సిజన్‌ సరఫరా మొదలుపెడుతుంది.
  • ముంజేతికి కట్టుకునే ఓ పరికరం ద్వారా ఎప్పటికప్పుడు ఎస్‌పీఓ2ను పరిశీలిస్తూ హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఆక్సిజన్‌ సరఫరా చేస్తుంటుంది. దీంతో వైద్యసిబ్బందిపై ఒత్తిడి తీవ్రంగా తగ్గుతుంది.
  • ఒక లీటర్‌ నుంచి మొదలుకొని 1,500 లీటర్ల ఆక్సిజన్‌ను సరఫరా చేయగల సామర్థ్యం ఉంటుంది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఎస్‌పీవో–2 సప్లిమెంటల్‌ ఆక్సిజన్‌ డెలివరీ సిస్టం అనే పరికరం అభివృద్ధి చేసిన సంస్థ?
ఎప్పుడు : ఏప్రిల్‌ 19
ఎవరు : డీఆర్‌డీవోకు చెందిన ది డిఫెన్స్‌ బయో ఇంజినీరింగ్‌ అండ్‌ ఎలక్ట్రో మెడికల్‌ లేబొరేటరీ
ఎందుకు : సరిహద్దులోని పర్వత ప్రాంతాల్లో గస్తీ కాసే సైనికులకు ఆక్సిజన్‌ అందించేందుకు...
Published date : 20 Apr 2021 06:18PM

Photo Stories