ఎఫ్‌ఐహెచ్ ఉత్తమ ఆటగాడిగా అర్తుర్ వాన్ డొరెన్
Sakshi Education
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ఉత్తమ ఆటగాడిగా ప్రపంచ చాంపియన్ బెల్జియంకు చెందిన డిఫెండర్ అర్తుర్ వాన్ డొరెన్ వరుసగా రెండో ఏడాది ఎంపికయ్యాడు.
ఈ మేరకు 2018 సంవత్సర పురస్కారాలను ఫిబ్రవరి 14న ఎఫ్‌ఐహెచ్ ప్రకటించింది. మహిళల విభాగంలో నెదర్లాండ్స్ క్రీడాకారిణి ఎవా డి గొయిడె (29) ఉత్తమ క్రిడాకారిణిగా నిలిచింది. అలాగే గోల్ కీపర్ విన్సెంట్ వనాచ్ ఉత్తమ గోల్ కీపర్‌గా, అర్తుర్ డి స్లూవర్ ఉత్తమ వర్ధమాన ఆటగాడిగా, బెల్జియం హెడ్ కోచ్ షేన్ మెక్ లాయిడ్ ఉత్తమ కోచ్‌గా నిలిచారు. 1998 నుంచి ప్రకటిస్తున్న ఎఫ్‌ఐహెచ్ అవార్డుల్లో ఇప్పటివరకు ఒక్క అవార్డు భారత్‌కు లభించలేదు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎఫ్‌ఐహెచ్ ఉత్తమ ఆటగాడు-2018 పురస్కారం
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : అర్తుర్ వాన్ డొరెన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎఫ్‌ఐహెచ్ ఉత్తమ ఆటగాడు-2018 పురస్కారం
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : అర్తుర్ వాన్ డొరెన్
Published date : 15 Feb 2019 05:40PM