ఏపీలోని ఏ జిల్లాలో ఎంఎస్‌ఏఎఫ్ స్టీల్ ప్లాంటు ఏర్పాటు కానుంది?
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ (ఎంఎస్‌ఏఎఫ్) నూతన స్టీల్ ప్లాంటు ఏర్పాటు కానుంది.
4 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఈ నూతన ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు నవంబర్ 6న ఎంఎస్‌ఏఎప్ సంస్థ వెల్లడించింది. ఇందుకోసం రూ.1,200 కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొంది. ఈ ప్లాంటు ఏర్పాటుతో 1,800 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయని కంపెనీ డెరైక్టర్ గౌతమ్ గనెరివాల్ తెలిపారు.
ఇప్పటికే సంస్థకు తెలంగాణ, ఏపీలో మూడు ప్లాంట్లు ఉన్నాయి. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.50 లక్షల మెట్రిక్ టన్నులు. వీటి సామర్థ్యం 2021లో 2.5 లక్షల మెట్రిక్ టన్నులకు చేరనుంది. ప్రస్తుతం సంస్థలో 8,000 మందికిపైగా ఉద్యోగులున్నారు. గ్రూప్ టర్నోవర్ రూ.2,100 కోట్లుగా ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ (ఎంఎస్‌ఏఎఫ్) నూతన స్టీల్ ప్లాంటు ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ (ఎంఎస్‌ఏఎఫ్)
ఎక్కడ : మంత్రాలయం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్

Published date : 07 Nov 2020 06:05PM