ఏపీలో తల్లి సురక్ష పథకం ప్రారంభం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లో ‘తల్లి సురక్ష’ పథకంను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిలో డిసెంబర్ 30న ప్రారంభించారు.
మరోవైపు ఎన్టీఆర్ వైద్యసేవ కింద అందించే నగదు రహిత వైద్యసేవల పరిమితిని ఏడాదికి రూ.2.50లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని దీనికి అనుసంధానించి, దాని తరహాలోనే ఎన్టీఆర్ వైద్యసేవ కింద కూడా ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ.5లక్షల వరకూ నగదు రహిత వైద్యసేవలను అందించనుంది. 2019, ఏప్రిల్ నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తల్లి సురక్ష పథకం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
అలాగే ఏపీ-108 మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఉచితంగా కాన్పులు చేయించుకునేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా సహజ ప్రసవానికి రూ.8వేలు, సిజేరియన్‌కు రూ.14,500 అందిస్తారు.ఇందుకోసం రూ.500కోట్ల వ్యయాన్ని ప్రభుత్వం భరించనుంది.
మరోవైపు ఎన్టీఆర్ వైద్యసేవ కింద అందించే నగదు రహిత వైద్యసేవల పరిమితిని ఏడాదికి రూ.2.50లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని దీనికి అనుసంధానించి, దాని తరహాలోనే ఎన్టీఆర్ వైద్యసేవ కింద కూడా ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ.5లక్షల వరకూ నగదు రహిత వైద్యసేవలను అందించనుంది. 2019, ఏప్రిల్ నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తల్లి సురక్ష పథకం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
Published date : 01 Jan 2019 06:06PM