Skip to main content

ఏపీలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా రాష్ట్రస్థాయిలో తొలిసారిగా ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్) విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.
నైపుణ్యాభివృద్ధి కోసం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్న 25 కళాశాలలు ఈ యూనివర్సిటీకి అనుబంధంగా పని చేస్తాయని తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్‌పై అక్టోబర్ 25న సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

సమీక్షా సమావేశం - సీఎం కీలక నిర్ణయాలు
  • ప్రభుత్వం తరఫున చేపట్టే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలన్నీ స్కిల్ డెవలప్‌మెంట్ వర్సిటీ పరిధిలోకి వస్తాయి. ప్రతి ప్రభుత్వ శాఖ ఇందులో భాగస్వామిగా మారుతుంది.
  • ఐటీఐ, పాలిటెక్నిక్, బీకాం సహా డిగ్రీ కోర్సులు, ఇంజనీరింగ్ విద్యార్థులతో అదనంగా ఏడాది పాటు అప్రెంటీస్ చేయించాలి. అప్రెంటీస్ చేశాక అవసరం అనుకుంటే మళ్లీ ఆరు నెలలపాటు శిక్షణ ఇవ్వాలి.
  • ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజీలకు డిజిటల్ ఎక్స్‌టెన్షన్ ఉండాలి. ఇందుకోసం ఓలా, ఉబర్ తరహాలో యాప్ రూపొందించాలి.
  • చదువులు ముగించుకొని విద్యా సంస్థల నుంచి బయటకు వస్తున్న ప్రతి విద్యార్థి ఉద్యోగం లేదా ఉపాధి పొందడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్) విశ్వవిద్యాలయం ఏర్పాటు
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా
Published date : 26 Oct 2019 05:43PM

Photo Stories