ఏపీలో గడప వద్దకే పెన్షన్ కార్యక్రమం ప్రారంభం
Sakshi Education
గ్రామ, వార్డు వలంటీరే స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛను డబ్బులు ఇచ్చే సరికొత్త పాలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాంది పలికింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన ‘గడప వద్దకే పెన్షన్’ కార్యక్రమం 13 జిల్లాల్లో ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధాప్య, వికలాంగ, వితంతువులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు గ్రామ, వార్డు వలంటీర్లు వారి ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందజేశారు. ఒక్క పూటలో 42,81291 మందికి పింఛన్ల పంపిణీ పూర్తయింది. ప్రభుత్వం అందజేసిన మొబైల్ ఫోను, బయోమెట్రిక్ డివైస్‌ను వెంట తీసుకెళ్లిన వలంటీర్లు.. లబ్ధిదారునితో వేలి ముద్రలు తీసుకొని పింఛన్ డబ్బులు అందజేశారు. ఈ కార్యక్రమంలో 2,16,874 మంది వలంటీర్లు తొలి రోజే 80 శాతం పైగా లబ్ధిదారులకు రూ.1,019 కోట్లు పంపిణీ చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గడప వద్దకే పెన్షన్ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 1
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : గడప వద్దకే పెన్షన్ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 1
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
Published date : 04 Feb 2020 05:12PM