ఏపీకి రూ.21,000 కోట్ల ఏఐఐబీ రుణం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా 3 బిలియన్ డాలర్ల (రూ.21 వేల కోట్లకు పైగా) రుణం అందించేందుకు ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) సంసిద్ధత వ్యక్తం చేసింది.
గతంలో ఇచ్చిన రుణానికి ఇది అదనమని బ్యాంకు ప్రతినిధులు వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రాధాన్యతల ప్రకారం ఈ డబ్బును ఖర్చు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఫిబ్రవరి 6న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఏఐఐబీ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ డి.జె.పాండియన్, డెరైక్టర్ జనరల్-ఇన్వెస్ట్‌మెంట్ ఆపరేషన్స్ డిపార్ట్‌మెంట్ యీ-ఎన్-పంగ్, ప్రిన్సిపల్ సోషల్ డెవలప్‌మెంట్ స్పెషలిస్ట్ సోమనాథ్ బసు భేటీ అయ్యారు. ఏఐఐబీ ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు సహాయ సహకారాలు అందిస్తోందని, వీటితోపాటు మరిన్ని ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలను వివరించడానికి ఏఐఐబీ ప్రధాన కార్యాలయానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రిని వారు ఆహ్వానించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌కు 3 బిలియన్ డాలర్ల (రూ.21 వేల కోట్లకు పైగా) రుణం ఇచ్చేందుకు సిద్ధం
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు (ఏఐఐబీ)
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌కు 3 బిలియన్ డాలర్ల (రూ.21 వేల కోట్లకు పైగా) రుణం ఇచ్చేందుకు సిద్ధం
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు (ఏఐఐబీ)
Published date : 07 Feb 2020 05:38PM