Skip to main content

ఏపీకి రూ.1,050.91 కోట్ల కేంద్ర నిధులు

2020–21 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నెలకు రెవెన్యూ లోటు భర్తీ కింద, అలాగే రాష్ట్ర విపత్తుల సహాయ నిధి అడ్వాన్స్‌ కింద కేంద్ర ప్రభుత్వం రూ.1,050.91 కోట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఏప్రిల్ 3న ఉత్తర్వులు జారీ చేసింది.
Current Affairs

నిధుల వివ‌రాలు...

  • 2020–21 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.5,987 కోట్లను సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ నెలకు రూ.491.41 కోట్లు విడుదల చేసింది.
  • రాష్ట్ర విపత్తుల సహాయ నిధి కింద 15వ ఆర్థిక సంఘం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,491 కోట్లను రాష్ట్రానికి సిఫార్సు చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.1,119 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల సహాయ నిధికి అడ్వాన్స్‌గా రూ.559.50 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది.
  • దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు భర్తీ కింద కేంద్రం ఏప్రిల్‌ నెలకు రూ.6,157.74 కోట్లు, అన్ని రాష్ట్రాలకు విపత్తుల సహాయ నిధి కింద అడ్వాన్స్‌గా తొలి విడతగా రూ.11,092 కోట్లను కేంద్రం విడుదల చేసింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.1,050.91 కోట్ల నిధులు విడుదల
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : రెవెన్యూ లోటు భర్తీ కింద, అలాగే రాష్ట్ర విపత్తుల సహాయ నిధి అడ్వాన్స్‌ కింద
Published date : 04 Apr 2020 04:22PM

Photo Stories