Skip to main content

ఏపీకి ప్రపంచ బ్యాంకు నుంచి రుణం

ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,264 కోట్ల (328 మిలియన్ డాలర్లు) రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపింది.
ఈ మేరకు ఢిల్లీలో జూన్ 27న జరిగిన సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచబ్యాంకు ప్రతినిధుల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ రుణ చెల్లింపునకు ఆరేళ్ల గ్రేస్ పీరియడ్‌తోపాటు 23.5 ఏళ్ల పరిమితి ఉంటుంది. ప్రపంచబ్యాంకు తాత్కాలిక కంట్రీ డెరైక్టర్ శంకర్‌లాల్ రుణ ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రపంచ బ్యాంకు అందించే రూ.2,264 కోట్ల రుణం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని పౌరులందరికీ మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించనున్నారు. ముఖ్యంగా గర్భిణులు, హైపర్ టెన్షన్, మధుమేహం, సర్వైకల్ క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడేవారికి మంచి వైద్యం అందుబాటులోకి రానుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రపంచ బ్యాంకు నుంచి రూ.2,264 కోట్ల (328 మిలియన్ డాలర్లు) రుణం
ఎప్పుడు : జూన్ 27
ఎవరు : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌లోని పౌరులందరికీ మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించేందుకు
Published date : 28 Jun 2019 06:21PM

Photo Stories