ఏపీఎస్‌ఆర్టీసీకి స్మార్ట్ మొబిలిటీ ప్రాజెక్టు అవార్డు
Sakshi Education
స్మార్ట్ సిటీ ఎంపవరింగ్ ఇండియా అవార్డులు-2019లో భాగంగా స్మార్ట్ మొబిలిటీ ప్రాజెక్టు విభాగంలో ఏపీఎస్‌ఆర్టీసీ అవార్డు గెలుచుకుంది.
ఏపీఎస్‌ఆర్టీసీలో వెహికల్ ట్రాకింగ్ అండ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టంను ప్రవేశపెట్టి సమర్థంగా అమలు పరిచినందుకుగాను ఈ అవార్డు లభించింది. ఈ పోటీల్లో మొత్తం దేశంలోని పది ఆర్టీసీలు పాల్గొన్నాయి. ప్రథమ స్థానంలో ఏపీఎస్‌ఆర్టీసీ నిలవగా, ద్వితీయ స్థానంలో కేఎస్‌ఆర్టీసీ నిలిచింది. ఢిల్లీలో ఫిబ్రవరి 28న జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పురి చేతుల మీదుగా అధికారులు సుధాకర్, శ్రీనివాసరావులు ఈ అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీఎస్‌ఆర్టీసీకి స్మార్ట్ మొబిలిటీ ప్రాజెక్టు అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : స్మార్ట్ సిటీ ఎంపవరింగ్ ఇండియా
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : వెహికల్ ట్రాకింగ్ అండ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టంను సమర్థంగా అమలు పరిచినందుకుగాను
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీఎస్‌ఆర్టీసీకి స్మార్ట్ మొబిలిటీ ప్రాజెక్టు అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : స్మార్ట్ సిటీ ఎంపవరింగ్ ఇండియా
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : వెహికల్ ట్రాకింగ్ అండ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టంను సమర్థంగా అమలు పరిచినందుకుగాను
Published date : 29 Feb 2020 05:39PM