ఏపీఎస్ ఆర్టీసీకి ఏఎస్‌ఆర్టీయూ ఎక్స్‌లెన్స్ అవార్డు
Sakshi Education
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండర్ టేకింగ్‌స (ఏఎస్‌ఆర్టీయూ) సంస్థ అందించే ప్రతిష్టాత్మక ఎక్స్‌లెన్స్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)కి ప్రథమ స్థానం దక్కింది.
‘ఐటీ ఇన్ డిజిటలైజేషన్’ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ పురస్కారం ఆర్టీసీని వరించింది. ఈ పోటీల్లో దేశంలోని 64 రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్లు పాల్గొనగా, ఏపీఎస్ ఆర్టీసీకి అవార్డు లభించింది. ఢిల్లీలో జనవరి 31న జరిగిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయమంత్రి విజయ్‌కుమార్ సింగ్ చేతుల మీదుగా ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ఈ అవార్డు కింద రూ.10 లక్షల నగదు పురస్కారం అందుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏఎస్‌ఆర్టీయూ ఎక్స్‌లెన్స్ అవార్డు విజేత
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఐటీ ఇన్ డిజిటలైజేషన్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏఎస్‌ఆర్టీయూ ఎక్స్‌లెన్స్ అవార్డు విజేత
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఐటీ ఇన్ డిజిటలైజేషన్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు
Published date : 04 Feb 2020 05:05PM