Skip to main content

ఏపీ, తెలంగాణకు జాతీయ అవార్డులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వివిధ విభాగాల్లో పలు జాతీయ పంచాయతీ అవార్డులు లభించాయి.
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 23న న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ అవార్డులను ప్రదానం చేశారు. జిల్లా స్థాయి అవార్డులను కలెక్టర్లు, మండల, గ్రామ స్థాయి అవార్డులను ఆ శాఖాధికారులు అందుకున్నారు.

జాతీయ పంచాయతీ అవార్డులు
  1. గ్రామ పంచాయతీ వికాస్ యోజన అవార్డు: కరకంబాడి గ్రామం( చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్)
  2. బాల్య మిత్ర పంచాయతీ అవార్డు: రాజువారి చింతలపాళెం(నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్), పైడిమడుగు(జగిత్యాల జిల్లా, తెలంగాణ)
  3. నానాజీ దేశ్‌ముఖ్ జాతీయ గౌరవ గ్రామ సభ పురస్కారం: శ్రీకూర్మం(శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్), రాఘవపూర్ గ్రామం(పెద్దపల్లి జిల్లా, తెలంగాణ)

దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తి కరణ్ అవార్డులు:
  1. ఆంధ్రప్రదేశ్ నుంచి
    జిల్లా పంచాయతీ పురస్కారం:
    చిత్తూరు జిల్లా
    మండల పంచాయతీ అవార్డులు: కర్నూలు, గుమ్మగట్ట, సబ్బవరం, వెదురుకుప్పం
    గ్రామ పంచాయతీ పురస్కారాలు: పొగిరి (శ్రీకాకుళం జిల్లా), బుట్టాయగూడెం (ప.గో. జిల్లా), కూచివారిపల్లి (వైఎస్సార్ జిల్లా), అచ్చంపేట(తూ.గో. జిల్లా) తాళ్వాయిపాడు (నెల్లూరు జిల్లా), కోణంకి (ప్రకాశం జిల్లా)
  2. తెలంగాణ నుంచి
    జిల్లా పంచాయతీ అవార్డు:
    ఆదిలాబాద్ జిల్లా
    మండల పంచాయతీ అవార్డులు: మంథని, వెల్గటూరు
    గ్రామ పంచాయతీ పురస్కారాలు: మల్కాపూర్ (మెదక్), ఇర్కోడు (సిద్దిపేట), మల్లారం (పెద్దపల్లి), నాగపూర్ (నిజామాబాద్)
Published date : 24 Oct 2019 05:32PM

Photo Stories