ఏపీ సమగ్రాభివృద్ధిపై బీసీజీ సిఫార్సులు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాజధానితోపాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) జనవరి 3న తన నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సమర్పించింది.
రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రాధాన్యత, సహజ వనరులు, అభివృద్ధి అవకాశాలను విశ్లేషిస్తూ సమగ్రాభివృద్ధికి కీలక సూచనలు చేసింది. న్యాయ, శాసన, పరిపాలన వ్యవస్థలను వికేంద్రీకరిస్తూ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. అందుకు ప్రభుత్వానికి రెండు ఆప్షన్లను సూచించింది. అమరావతి నిర్మాణం ఆర్థికంగా లాభదాయకం కాదని, పైగా రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టేస్తుందని.. అందువల్ల ఆశించిన ప్రయోజనాలు చేకూరవని పేర్కొంది.
బీసీజీ ఆప్షన్లు ఇవీ..
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ రాజధాని, సమగ్రాభివృద్ధిపై నివేదిక అందజేత
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ)
మాదిరి ప్రశ్నలు
బీసీజీ ఆప్షన్లు ఇవీ..
ఏమిటి : ఏపీ రాజధాని, సమగ్రాభివృద్ధిపై నివేదిక అందజేత
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ)
మాదిరి ప్రశ్నలు
1. వృత్తిలోకి కొత్తగా ప్రవేశించిన న్యాయవాదులకు ఆర్థిక సాయం చేసేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకం కింద నెలకు ఎంత మొత్తాన్ని అందిస్తున్నారు?
1. రూ. 2000
2. రూ. 4000
3. రూ. 8000
4. రూ. 5000
- View Answer
- సమాధానం : 4
2. 5వ ఏపీ సైన్స్ కాంగ్రెస్ -2019ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ 2019, నవంబర్ 28న ఎక్కడ ప్రారంభించారు?
1. తిరుపతి, చిత్తూరు జిల్లా
2. ఎచ్చెర్ల, శ్రీకాకుళం జిల్లా
3. పెనుగొండ, అనంతపురం జిల్లా
4. మంగళగిరి, గుంటూరు జిల్లా
- View Answer
- సమాధానం : 2
Published date : 04 Jan 2020 05:59PM