ఏపీ శాసనమండలి కొత్త చైర్మన్‌గా షరీఫ్
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి కొత్త చైర్మన్‌గా మహ్మద్ అహ్మద్ షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ మేరకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఫిబ్రవరి 7న ప్రకటించారు. చైర్మన్ ఎన్నికకు అహ్మద్ షరీఫ్ ఒక్కరే నామినేషన్ వేశారని, అందువల్ల ఆయనను ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు ప్రకటిస్తున్నానని చెప్పారు. ఇప్పటివరకు శాసన మండలిలో ప్రభుత్వ విప్‌గా షరీఫ్ కొనసాగారు. మండలి చైర్మన్‌గా కొనసాగిన ఎన్‌ఎండీ ఫరూక్ 2018, నవంబరులో మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఇన్నాళ్లు ఆ పదవి ఖాళీగా ఉంది.
1955, జనవరి 1న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో షరీఫ్ జన్మించారు. ఎంకామ్, ఎల్‌ఎల్‌బీ చేసిన ఆయన 1982లో టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు. నరసాపురం పట్టణ పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా పార్టీ కార్యదర్శిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. 2015 నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. 2017 నుంచి శాసనమండలి ప్రభుత్వ విప్‌గా కొనసాగారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి కొత్త చైర్మన్ ఎన్నిక
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : మహ్మద్ అహ్మద్ షరీఫ్

Published date : 08 Feb 2019 05:44PM