ఏపీ పశుసంవర్థక శాఖకు అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్
Sakshi Education
సీఎస్‌ఐ స్పెషల్ ఇంట్రస్ట్ గ్రూప్ (సీఐజీ) ఇన్ ఈ-గవర్నెన్స్ కేటగిరిలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచినందుకు గానూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్థక శాఖకు జాతీయ స్థాయిలో ‘అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్-2020’ లభించింది.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఫిబ్రవరి 12న జరిగిన కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా రాష్ట్ర అధికారులు ఈ అవార్డును అందుకున్నారు.
ఏపీ పశుసంవర్థక శాఖ పశు పోషకుల శ్రేయస్సు కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు మందుల సరఫరా, విధి నిర్వహణ, శిక్షణ వంటి కార్యక్రమాలను 42కు పైగా వెబ్ ఆధారిత అప్లికేషన్ల ద్వారా చేపట్టింది. దీంతో ఆ శాఖను అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ వరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీఐజీ ఇన్ ఈ-గవర్నెన్స్ కేటగిరిలో అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్-2020 విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్థక శాఖ
ఎందుకు : అత్యుత్తమ ప్రతిభను కనబరిచినందుకు గానూ

Published date : 13 Feb 2021 05:45PM