ఏపీ పోలీసులకు సేవా పతకాలు
Sakshi Education
విధి నిర్వహణలో విశిష్ణ సేవలు, ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు సేవా పతకాలను ప్రదానం చేశారు.
విజయవాడ ఐజీఎం స్టేడియంలో ఆగస్టు 15న జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పతకాలను అందజేశారు. ఆయా విభాగాల్లో 2014, 2017, 2018, 2019కి సంబంధించి 87 మంది రాష్ట్ర పోలీసులకు కేంద్ర పరిధిలో ప్రకటించిన ప్రెసిడెంట్ పోలీస్ మెడల్(పీపీఎం), ఇండియన్ పోలీస్ మెడల్(ఐపీఎం), పోలీస్ మెడల్ గ్యాలంటరీ(పీఎంజీ) పతకాలను వారందుకున్నారు.
విధి నిర్వహణలో మృతి చెందిన గ్రేహౌండ్స్ సీనియర్ కమాండెంట్ ఎండీ అబూబాకర్ తరఫున ఆయన తండ్రి ఎండీ మదీన పోలీస్ మెడల్ గ్యాలంటరీ పతకాన్ని అందుకున్నారు. జీవన్ రక్ష పతకాన్ని నిమ్మల వీరవెంకట రమణ అందుకున్నారు.
పతకాలు అందుకున్న ఐపీఎస్‌లు, ఇతర ప్రముఖుల వివరాలివే..

పేరు | హోదా | పతకం |
హరీష్‌కుమార్ గుప్త | హోంగార్డ్స్ ఏడీజీ | పీపీఎం-2018 |
షేక్ మహ్మద్ ఇక్బాల్ | రిటైర్డ్ ఐపీఎస్ | పీపీఎం-2018 |
గోరంట్ల వెంకటగిరి అశోక్ | సీఐడీ ఎస్పీ | ఐపీఎం-2018 |
ఎం.రవిప్రకాష్ | ఎస్‌ఐబీ ఎస్పీ | ఐపీఎం-2018 |
రాహుల్‌దేవ్ శర్మ | గ్రేహౌండ్స్ | పీఎంజీ-2017 |
అట్టాడ బాపూజీ | విశాఖ రూరల్ ఎస్పీ | పీఎంజీ-2017 |
జంగారెడ్డి కోటేశ్వరరావు | 5వ బెటాలియన్ | పీపీఎం-2018 |
ఎ.వెంకటరత్నం | ఎస్‌ఐబీ ఎస్పీ | పీపీఎం-2019 |
కొవ్వూరి సూర్యభాస్కరరెడ్డి | తిరుపతి పీటీసీ ప్రిన్సిపాల్ | పీపీఎం-2018 |
బత్తుల శ్రీరామమూర్తి | 3వ బెటాలియన్ | ఐపీఎం-2018 |
పెంట వెంకట రవికుమార్ | ఏసీబీ అడిషనల్ డీసీపీ | ఐపీఎం-2018 |
పీవీ రామిరెడ్డి | ఏఎస్పీ | ఐపీఎం-2014 |
అధికారి మురళీ | అసెంబ్లీ చీఫ్ మార్షల్ | ఐపీఎం-2018 |
పప్పుల మురళీధర్ | ఇంటెలిజెన్స్ డీఎస్పీ | ఐపీఎం-2018 |
Published date : 16 Aug 2019 04:36PM