ఏపీ పోలీస్ శాఖకు డిజిటల్ ఎక్స్‌లెన్స్ అవార్డులు
Sakshi Education
దేశంలో అనేక విభాగాల్లో టెక్నాలజీ వినియోగానికి సంబంధించి ‘డిజిటల్ టెక్నాలజీ సభ గ్రూప్’ ప్రకటించిన అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తన సత్తా చాటింది.
జాతీయ స్థాయిలో 12 అవార్డులను ప్రకటించగా అందులో నాలుగింటిని గెలుచుకుంది. ఏపీ పోలీస్ శాఖ నిర్వహిస్తున్న దిశ మొబైల్ అప్లికేషన్, దిశ క్రైమ్ సీన్ మేనేజ్‌మెంట్, సెంట్రల్ లాకప్ మానిటరింగ్ సిస్టమ్, 4ఎస్4యు యూట్యూబ్ చానెల్‌కు ఈ నాలుగు అవార్డులు దక్కాయి. వెబినార్ ద్వారా ఫిబ్రవరి 27న నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అవార్డులను అందుకున్నారు.
లాకప్ మానిటరింగ్‌లో అగ్రస్థానం...
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి అన్ని పోలీస్‌స్టేషన్‌లలో ‘సెంట్రల్ లాకప్ మానిటరింగ్ సిస్టమ్’ అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. పారదర్శకత, జవాబుదారీతనం, మానవ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సెంట్రల్ లాకప్ మానిటరింగ్ సిస్టమ్‌ను అమల్లోకి తెచ్చారు.

Published date : 01 Mar 2021 06:10PM