ఏపీ పాఠశాల విద్యాకమిషన్ చైర్మన్‌గా కాంతారావు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యానియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్‌గా ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి కాంతారావు నియమితులు కానున్నారు.
హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) చాగరి ప్రవీణ్‌కుమార్ సిఫార్సు మేరకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 13న ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నియామకానికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. పాఠశాల విద్యారంగాన్ని పూర్తిగా సంస్కరించే దిశగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కమిషన్‌కు వైస్ చైర్మన్‌గా జాతీయ స్థాయిలో పేరు పొందిన విద్యారంగ నిపుణుడు ఉంటారు. ఐదుగురు విద్యావేత్తలు, ఇద్దరు ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉంటారు. కార్యదర్శి స్థాయి అధికారి సీఈవోగా వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యానియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : జస్టిస్ రెడ్డి కాంతారావు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యానియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : జస్టిస్ రెడ్డి కాంతారావు
Published date : 14 Sep 2019 05:30PM