Skip to main content

ఏపీ మహిళా కమిషన్ లోగో ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ లోగోను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు.
Current Affairsఏపీ అసెంబ్లీలో డిసెంబర్ 16న జరిగిన లోగో కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, మహిళా సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ ఆర్‌కే రోజా పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ 2019, ఆగస్టు 26న ప్రమాణ స్వీకారం చేశారు. కమిషన్ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ కేబినెట్ హోదాతో ప్రభుత్వం నియమించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ లోగో ఆవిష్కరణ
ఎప్పుడు : డిసెంబర్ 16
ఎవరు : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఏపీ అసెంబ్లీ
Published date : 17 Dec 2019 05:36PM

Photo Stories