Skip to main content

ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవోగా నియమితులైన అధికారి?

ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవోగా లెఫ్టినెంట్ కమాండర్ రవీంద్రనాథ్‌రెడ్డి నియమితులయ్యారు.
Current Affairs
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ డిసెంబర్ 31న ఉత్తుర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ఓడరేవుల్లో వాణిజ్య అవకాశాలను పెంచడం, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటం, ఒప్పందాలు అమలయ్యేలా చూడటం వంటి బాధ్యతలను రవీంద్రనాథ్ రెడ్డి తీసుకున్నారు.

ఆప్కో చైర్మన్‌గా చిల్లపల్లి...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావును ఆప్కో చైర్మన్‌గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 31న ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత వర్గాల తరఫున సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన ముందున్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవోగా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : లెఫ్టినెంట్ కమాండర్ రవీంద్రనాథ్‌రెడ్డి
Published date : 01 Jan 2021 06:08PM

Photo Stories