ఏపీ హైకోర్టు కొత్త సీజేగా నియమితులైన న్యాయమూర్తి పేరు?
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి
ఎందుకు : జస్టిస్ జేకే మహేశ్వరి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయిన నేపథ్యంలో...
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకంపై కేంద్ర న్యాయశాఖ డిసెంబర్ 31న ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం...
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం...
- ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జేకే మహేశ్వరి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ప్రస్తుతం సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాలి.
- మధ్యప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మహ్మద్ రఫీఖ్, ఒడిశా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్.మురళీధర్, మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీబ్ బెనర్జీలు బాధ్యతలు స్వీకరించాలి.
- కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాలి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి
ఎందుకు : జస్టిస్ జేకే మహేశ్వరి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయిన నేపథ్యంలో...
Published date : 01 Jan 2021 06:06PM