ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్‌గా శ్రీకాంత్‌రెడ్డి
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి నియమితులయ్యారు.
అలాగే మరో ఏడుగురు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌లుగా నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా జూన్ 12న ఉత్తర్వులు జారీచేశారు. రాయచోటి నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా శ్రీకాంత్‌రెడ్డి ఎన్నికయ్యారు.
అలాగే అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌లుగా మాడుగుల ఎమ్మెల్యే బి.ముత్యాలనాయుడు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రామలింగేశ్వరరావు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ప్రభుత్వం నియమించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ నియామకం
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : గడికోట శ్రీకాంత్‌రెడ్డి

Published date : 13 Jun 2019 05:37PM