ఎన్‌పీఏ నూతన డెరైక్టర్‌గా అతుల్ కర్వాల్
Sakshi Education
హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ) నూతన డెరైక్టర్‌గా అతుల్ కర్వాల్ నియమితులయ్యారు.
ఈ మేరకు డిసెంబర్ 18న కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2021 డిసెంబరు 5 లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అతుల్ ఎన్‌పీఏ డెరైక్టర్‌గా కొనసాగనున్నారు. 1988 ఐపీఎస్ బ్యాచ్, గుజరాత్ కేడర్‌కు చెందిన అతుల్ ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్‌పీఏ డెరైక్టర్‌గా ఉన్న అభయ్ ఒడిశా డీజీపీగా వెళ్లడంతో ఆయన స్థానంలో అతుల్ నియమితులయ్యారు. సాధారణంగా వాస్తవంగా ఎన్‌పీఏ డెరైక్టర్‌గా డీజీ హోదా అధికారిని నియమిస్తారు. అయితే ఈ పోస్టును అదనపు డీజీ స్థాయికి తగ్గించి అతుల్‌ను నియమించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సర్దార్ వల్లభ్‌భాయ్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ) నూతన డెరైక్టర్‌గా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : అతుల్ కర్వాల్
క్విక్ రివ్యూ :
ఏమిటి : సర్దార్ వల్లభ్‌భాయ్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ) నూతన డెరైక్టర్‌గా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : అతుల్ కర్వాల్
Published date : 19 Dec 2019 06:01PM