Skip to main content

ఎన్నికల కమిషన్ వెబ్ రేడియో పేరు?

మొబైల్ ఫోన్లలో, పర్సనల్ కంప్యూటర్లలలో డౌన్‌లోడ్ చేసుకునే ‘‘డిజిటల్ ఓటర్స్ ఫొటో ఐడెంటిటీ కార్డు’’ని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆవిష్కరించింది.
Current Affairs నేషనల్ ఓటర్స్ డే(జనవరి 25) సందర్భంగా కేంద్ర న్యాయశాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఎలక్టోర్ ఫొటో ఐడెంటిటీ కార్డుని లాంఛన ప్రాయంగా ప్రారంభించారు. అలాగే ఎన్నికల కమిషన్ వెబ్ రేడియో ‘‘హెలో వోటర్స్’’ని న్యూఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. ఈ ఓటర్ కార్డుని మార్చే అవకాశం లేకుండా ఈ-ఓటర్ కార్డు పీడీఎఫ్ ఫాంలో ఉంటుంది. అవసరమైనప్పుడు దీన్ని ప్రింట్ చేసుకోవచ్చు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎన్నికల కమిషన్ వెబ్ రేడియో హెలో వోటర్స్ ఆవిష్కరణ
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఎన్నికల సంబంధిత విషయాలను ప్రజలకు తెలియజేసేందుకు
Published date : 26 Jan 2021 07:53PM

Photo Stories