ఎన్ని వేల కోట్లతో ఆయుధాల కొనుగోలుకు డీఏసీ ఆమోదం తెలిపింది?
Sakshi Education
రూ.28 వేల కోట్లతో సైన్యానికి అవసరమైన ఆయుధాలు, ఇతర పరికరాల కొనుగోలుకు <b>భారత రక్షణ శాఖకు చెందిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ)</b> డిసెంబర్ 17న ఆమోదం తెలియజేసింది.
ఇందులో వాయుసేన కోసం 6 గగనతల హెచ్చరిక, నియంత్రణ విమానాలు, నావికాదళం కోసం 11 అత్యాధునిక నిఘా నౌకలు కూడా ఉన్నాయి. 38 బ్రహ్మోస్ సూపర్‌సానిక్ క్రూయిజ్ మిస్సైళ్ల కొనుగోలు ప్రతిపాదనను కూడా డీఏసీ ఆమోదించింది.
మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ దేశీయంగా తయారైన ఆయుధాల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూ.28 వేల కోట్లతో సైన్యానికి అవసరమైన ఆయుధాలు, ఇతర పరికరాల కొనుగోలుకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : భారత రక్షణ శాఖకు చెందిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ)

Published date : 18 Dec 2020 06:40PM