ఎన్‌ఈసీ 68వ ప్లీనరీలో హోంమంత్రి అమిత్ షా
Sakshi Education
అస్సాంలోని గువాహటిలో సెప్టెంబర్ 8న జరిగిన ఈశాన్య రాష్ట్రాల మండలి (ఎన్‌ఈసీ) 68వ ప్లీనరీ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 371 జోలికి వెళ్లబోమని తెలిపారు. ఎన్‌ఆర్‌సీని ప్రస్తావిస్తూ.. అక్రమ చొరబాటుదారులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదన్న విధానానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈశాన్య ప్రాంతంలోని వివిధ రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలకు ముగింపు పలకాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈశాన్య రాష్ట్రాల మండలి (ఎన్‌ఈసీ) 68వ ప్లీనరీ సమావేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఎక్కడ : గువాహటి, అస్సాం
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈశాన్య రాష్ట్రాల మండలి (ఎన్‌ఈసీ) 68వ ప్లీనరీ సమావేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఎక్కడ : గువాహటి, అస్సాం
Published date : 09 Sep 2019 05:48PM