ఎనిమిదేళ్ల నిషేధానికి గురైన టెన్నిస్ ఆటగాడు?
Sakshi Education
2017లో జరిగిన పలు టోర్నీల్లో స్పెయిన్ ఆటగాడు ఎన్రిక్ లోపెజ్ పెరెజ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు రుజువైంది. దీంతో అతడిపై ఎనిమిదేళ్ల నిషేధం విధిస్తూ టెన్నిస్ ఇంటెగ్రిటీ యూనిట్ నిర్ణయం తీసుకుంది.
అలాగే 25 వేల డాలర్ల (రూ. 18 లక్షలు) జరిమానా కూడా విధించింది. తన కెరీర్‌లో అత్యుత్తమంగా 154వ ర్యాంక్ వరకు చేరు కున్న 29 ఏళ్ల లోపెజ్ ఇప్పటి వరకు ఒక్క గ్రాండ్ స్లామ్ టోర్నీ ప్రధాన ‘డ్రా’కు అర్హత సాధించలేదు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టెన్నిస్ ఆటగాడు ఎన్రిక్ లోపెజ్ పెరెజ్‌పై ఎనిమిదేళ్ల నిషేధం
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : టెన్నిస్ ఇంటెగ్రిటీ యూనిట్
ఎందుకు : మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినందున
క్విక్ రివ్యూ :
ఏమిటి : టెన్నిస్ ఆటగాడు ఎన్రిక్ లోపెజ్ పెరెజ్‌పై ఎనిమిదేళ్ల నిషేధం
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : టెన్నిస్ ఇంటెగ్రిటీ యూనిట్
ఎందుకు : మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినందున
Published date : 02 Dec 2020 06:07PM