Skip to main content

ఎన్‌హెచ్‌బీ నుంచి ఆర్‌బీఐ నిష్క్రమణ

నేషనల్ హౌసింగ్ బ్యాంక్(ఎన్‌హెచ్‌బీ), నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డ్)ల నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిష్ర్కమించింది.
వాటిలో తనకు ఉన్న మొత్తం వాటాలను వరుసగా రూ.1450 కోట్లు, రూ.20 కోట్లకు కేంద్ర ప్రభుత్వానికి విక్రయించినట్లు ఏప్రిల్ 24న ఆర్‌బీఐ ప్రకటించింది. మార్చి 19న ఎన్‌హెచ్‌బీలో, ఫిబ్రవరి 26న నాబార్డ్‌లో తన వాటాలను ప్రభుత్వానికి విక్రయించినట్లు పేర్కొంది. దీంతో ఈ రెండు సంస్థల్లోని 100 శాతం వాటాలు ప్రభుత్వానికి చేరినట్లయింది.

బ్యాంకింగ్ రంగాన్ని నియంత్రించే ఆర్‌బీఐ అదే రంగ సంస్థల్లో వాటాలు కూడా కలిగి ఉండటం సరికాదని నరసింహం రెండో కమిటీ సిఫార్సు చేస్తూ 2001, అక్టోబర్‌లో తన నివేదికను ఇచ్చింది. ఈ నివేదికతోపాటు ఆర్‌బీఐ సొంతం చర్చా పత్రమైన ‘హార్మనైజింగ్ ద రోల్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ డెవలపమ్‌మెంట్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ బ్యాంక్స్’ సిఫారసుల అమలులో భాగంగానే ఈ పరిణామం చోటు చేసుకుంది. 1982, జులై 12న నాబార్డ్ ఏర్పాటు కాగా, హౌసింగ్ రంగానికి ఊతమిచ్చే యోచనతో 1987-88లో బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ఎన్‌హెచ్‌బీ ఏర్పాటైంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఎన్‌హెచ్‌బీ, నాబార్డ్‌ల నిష్ర్కమణ
ఎప్పుడు : ఏప్రిల్ 24
ఎవరు : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా
Published date : 25 Apr 2019 05:14PM

Photo Stories