ఎన్‌హెచ్‌బీ ఎండీగా శారద కుమార్ హోతా
Sakshi Education
నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) మేనేజింగ్ డెరైక్టర్(ఎండీ)గా శారద కుమార్ హోతాను నియమిస్తూ జూన్ 27న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కుమార్ ఎన్‌హెచ్‌బీ ఎండీగా మూడేళ్ల పాటు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంతకుముందు కెనరా బ్యాంక్ అనుబంధ సంస్థ కెన్ ఫిన్ హోమ్స్ జనరల్ మేనేజర్‌గా ఆయన సేవలందించారు. అవకతవకల ఆరోపణల నేపథ్యంలో మునుపటి ఎండీ శ్రీరామ్ కల్యాణారామన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా.. తొమ్మిది నెలల ఖాళీ తరువాత ఈ స్థాన్నాన్ని ప్రభుత్వం భర్తీచేసింది. ఈ కాలంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి దక్షిత దాస్ ఎన్‌హెచ్‌బీ అదనపు బాధ్యతలు నిర్వహించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) ఎండీగా నియామకం
ఎప్పుడు : జూన్ 27
ఎవరు : శారద కుమార్ హోతా
క్విక్ రివ్యూ :
ఏమిటి : నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) ఎండీగా నియామకం
ఎప్పుడు : జూన్ 27
ఎవరు : శారద కుమార్ హోతా
Published date : 28 Jun 2019 06:07PM