ఎన్‌ఎండీసీతో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ ఒప్పందం
Sakshi Education
జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ)తో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది.
అమరావతిలో డిసెంబర్ 18న జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ సీఎండీ పి.మధుసూదన్, ఎన్‌ఎండీసీ ప్రతినిధి అలోక్ కుమార్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం... ఎన్‌ఎండీసీ ఏటా 5 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని సరఫరా చేయనుంది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లోనెలకొల్పనున్న కడప ఉక్కు ఉక్కు కర్మాగారానికి ఈ ముడి ఇనుమును సరఫరా చేయనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ)తోఒప్పందం
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్
ఎందుకు : ఏటా 5 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని సరఫరా చేసేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ)తోఒప్పందం
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్
ఎందుకు : ఏటా 5 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని సరఫరా చేసేందుకు
Published date : 19 Dec 2019 05:56PM