Skip to main content

ఎన్‌ఎండీసీ ఐరన్, స్టీల్ ప్లాంట్ డీమెర్జ్

మైనింగ్ రంగ దిగ్గజం నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌ఎండీసీ).. ఛత్తీస్‌గఢ్‌లోని నాగర్నార్ వద్ద నిర్మిస్తున్న ఎన్‌ఎండీసీ ఐరన్, స్టీల్ ప్లాంట్‌ను కంపెనీ నుంచి విడగొట్టనున్నట్టు (డీమెర్జ్) ఆగస్టు 28న ప్రకటించింది.
Current Affairs
డీమెర్జ్ ప్రక్రియ పూర్తి కావడానికి తొమ్మిది నెలల వరకు సమయం పట్టవచ్చని ఎన్‌ఎండీసీ వివరించింది. ఏటా 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్లాంటుకు ఎన్‌ఎండీసీ ఇప్పటి వరకు రూ.17,000 కోట్లు ఖర్చు చేసింది. 2021లో ఈ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభం కానుంది.

విప్రో హైజెనిక్స్ విడుదల...
ఎఫ్‌ఎంజీసీ రంగంలోని విప్రో కన్జూమర్ కేర్ ‘‘హైజెనిక్స్’’ బ్రాండ్ పేరుతో సూక్ష్మజీవుల సంహారక ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఉత్పత్తిలో భాగమైన శానిటైజర్, హ్యాండ్ వాష్, సబ్బు బలమైన ఫార్ములేషన్‌తో పాటు 99.9శాతం క్రిముల నుంచి రక్షణనిస్తుందని నిరూపితమైందని కంపెనీ పేర్కొంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఎన్‌ఎండీసీ ఐరన్, స్టీల్ ప్లాంట్ డీమెర్జ్
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌ఎండీసీ)
ఎక్కడ : నాగర్నార్, ఛత్తీస్‌గఢ్
Published date : 29 Aug 2020 05:38PM

Photo Stories