Skip to main content

ఎన్‌డీటీవీ ప్రణయ్‌రాయ్‌పై సెబీ నిషేధం

ఎన్‌డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికా రాయ్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది.
వారిద్దరి హోల్డింగ్ కంపెనీలు రెండేళ్ల పాటు క్యాపిటల్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని సెబీ ఆదేశించింది. ఈ రెండేళ్లలో ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లు బోర్డ్ పదవితో పాటు ఎలాంటి ఉన్నతోద్యోగాలు చేపట్టరాదని జూన్ 14న ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా ఏడాది కాలంలో ఏ లిస్టెడ్ కంపెనీలో కూడా డెరైక్టర్‌గా వ్యవహరించకూడదని పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఇతర సంస్థల నుంచి రుణాలు తీసుకునే విషయంలో మైనారిటీ వాటాదారులకు తగిన వివరాలు వెల్లడించనందుకే ఈ నిషేధం విధిస్తునుట్లు సెబీ వివరించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఎన్‌డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికా రాయ్ పై నిషేదం
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ
ఎందుకు : బ్యాంకుల రుణాలు తీసుకునే విషయంలో మైనారిటీ వాటాదారులకు తగిన వివరాలు వెల్లడించనందుకు
Published date : 15 Jun 2019 06:18PM

Photo Stories