Skip to main content

ఎంసీఈఎంఈ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మధ్య ఒప్పందం

ఆర్మర్డ్ ట్రాక్డ్ రిపేర్ వాహనాల (ఏటీఆర్‌వీ) అంశంలో సమన్వయంతో పనిచేసేందుకు... సికింద్రాబాద్‌లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (ఎంసీఈఎంఈ), సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఒప్పందం చేసుకున్నాయి.
Current Affairs
ఫిబ్రవరి 19న కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం ఏటీఆర్‌వీలకు సంబంధించిన శిక్షణ, తయారీ, విడిభాగాల రూపకల్పన, సాంకేతిక అంశాలపై ఇరు సంస్థలు కలిసి పనిచేస్తాయి.

స్విగ్గీతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఎంఓయూ
వీధి వ్యాపారుల ఆహార పదార్థాలకు ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్లు స్వీకరించి వినియోగదారులకు డెలివరీ చేయడానికి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల స్విగ్గీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సర్టిఫికెట్‌గల హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డర్లు స్వీకరించి ఆహారాన్ని డెలివరీ చేయడానికి మాత్రమే ఫుడ్ డెలివరీ యాప్స్ సేవలు అందుబాటులోకి ఉన్నాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : సికింద్రాబాద్‌లోని ఎంసీఈఎంఈ, సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మధ్య ఒప్పందం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎందుకు : ఆర్మర్డ్ ట్రాక్డ్ రిపేర్ వాహనాల (ఏటీఆర్‌వీ) అంశంలో సమన్వయంతో పనిచేసేందుకు...
Published date : 22 Feb 2021 06:07PM

Photo Stories