Skip to main content

ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి బీఎస్‌ఈతో ఒప్పందం చేసుకున్న రాష్ట్రం?

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్‌ఎంఈ) కంపెనీల వ్యాపారం పెంపు లక్ష్యంగా పనిచేస్తున్న గ్లోబల్ లింకర్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా స్టాక్ ఎక్స్ఛేంజ్ బీఎస్‌ఈతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
Current Affairs
ఆర్థిక వనరుల లభ్యత, కంపెనీల విశ్వసనీయతను పెంచే కీలక సవాల్‌ను పరిష్కరించేందుకు ఈ ఒప్పందం దోహదం చేయనుంది. అలాగే లిస్టింగ్ ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి కంపెనీలకు అవగాహన కల్పించేందుకు బీఎస్‌ఈ సాయం చేస్తుంది.

తాజా భాగస్వామ్యం ద్వారా విస్తరణ మొదలుకుని కొనుగోళ్ల స్థాయికి వ్యాపారం ఎదిగేందుకు ఎంఎస్‌ఎంఈలకు నిధుల సమీకరణకు తోడ్పాటు లభిస్తుందని బీఎస్‌ఈ ఎండీ, సీఈవో ఆశిశ్ కుమార్ చౌహాన్ పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : స్టాక్ ఎక్స్ఛేంజ్ బీఎస్‌ఈతో అవగాహన ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 19
ఎవరు : గ్లోబల్ లింకర్, తెలంగాణ ప్రభుత్వం
ఎందుకు : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్‌ఎంఈ) కంపెనీల వ్యాపారం పెంపు లక్ష్యంగా
Published date : 20 Oct 2020 05:36PM

Photo Stories