ఎంఎస్‌ఎంఈ ప్రేరణ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ రంగ బ్యాంకు?
Sakshi Education
ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)ల వృద్ధికి తనవంతు ప్రోత్సాహక సహకారాలను అందించనుంది.
ఇందుకు సంబంధించి ‘ఎంఎస్‌ఎంఈ ప్రేరణ’ పేరుతో ప్రత్యేక ఆన్‌లైన్ వ్యాపార పర్యవేక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. చెన్నైలోని బ్యాంక్ కార్పొరేట్ సెంటర్‌లో అక్టోబర్ 7న ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ప్రధాన ధ్యేయం...
నైపుణ్యంలో మెరుగుదల, సామర్థ్యం పెంపు ద్వారా పరిశ్రమల సాధికారత పటిష్టం ఎంఎస్‌ఎంఈ ప్రేరణ ప్రధాన ధ్యేయమని ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. పూర్ణత అండ్ కంపెనీ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమానికి డిజైన్ చేసినట్లు తెలిపింది. స్థానిక భాషల్లో ఈ కార్యక్రమం అందుబాటులో ఉందని పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎంఎస్‌ఎంఈ ప్రేరణ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 7
ఎవరు : ఇండియన్ బ్యాంక్
ఎందుకు : ఎంఎస్‌ఎంఈల వృద్ధికి తనవంతు ప్రోత్సాహక సహకారాలను అందించేందుకు

Published date : 08 Oct 2020 05:28PM