ఎల్జేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రాజకీయ నేత?
Sakshi Education
లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) నూతన జాతీయ అధ్యక్షుడిగా ఎంపీ పశుపతి కుమార్ పరాస్ ఎన్నికయ్యారు.
ఈ విషయాన్ని జూన్ 17న ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఎల్జేపీ వ్యవస్థాపకుడు రాం విలాస్ పాశ్వాన్ సోదరుడు, ఎంపీ పశుపతి మరో నలుగురు ఎంపీలతో కలిసి వేరుకుంపటి ప్రకటించుకుని, పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌ను తొలగిస్తున్నట్లు ఇటీవల ప్రకటించడం తెలిసిందే.
జెడ్ కేటగిరీ భద్రత వద్దు: ముకుల్ రాయ్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇటీవలే అధికార టీఎంసీలో చేరిన రాజకీయ నేత, ఎమ్మెల్యే ముకుల్ రాయ్(67) తనకున్న జెడ్ కేటగిరీ భద్రతను వదులుకున్నారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు. ముకుల్ వినతి మేరకు భద్రత ఉపసంహరణకు సంబంధించి సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్)కు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది.

Published date : 18 Jun 2021 06:03PM