ఎల్‌ఎస్‌ఐ అధ్యక్షుడిగా ఎంపికైన తొలి తెలుగు వ్యక్తి?
Sakshi Education
లింగ్విస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియా(ఎల్‌ఎస్‌ఐ) అధ్యక్షుడిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) ప్రొఫెసర్ గారపాటి ఉమామహేశ్వరరావు ఎంపికయ్యారు.
దీంతో ఎల్‌ఎస్‌ఐ అధ్యక్షుడిగా ఎంపికైన తొలి తెలుగు వ్యక్తిగా ఉమామహేశ్వరరావు నిలిచారు. హెచ్‌సీయూలో 35 ఏళ్లుగా అనువర్తిత భాషాశాస్త్రం- అనువాద అధ్యయన కేంద్రం డెరైక్టర్‌గా, డీన్‌గా వివిధ పదవుల్లో ఉమామహేశ్వరరావు పనిచేశారు. గతంలో ద్రావిడ భాషా శాస్త్రజ్ఞుల సంఘం అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు.
భాషల వికాసం కోసం...
ఎల్‌ఎస్‌ఐ సంస్థ దేశంతోపాటు ఇతర దేశాల్లోనూ భారతీయ భాషల వికాసం కోసం పరిశోధన, శిక్షణ, సమాచార వినిమయం, అనువర్తనం కోసం జాతీయ, అంతర్జాతీయ సదస్సులను నిర్వహిస్తోంది. జాతీయ నూతన విద్యా విధానాన్ని అనుసరించి భారతీయ భాషల అభివృద్ధికి, బోధనలకు సంస్థ కృషి చేస్తుందని ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎల్‌ఎస్‌ఐ అధ్యక్షుడిగా ఎంపికైన తొలి తెలుగు వ్యక్తి
ఎప్పుడు : డిసెంబర్ 10
ఎవరు : హెచ్‌సీయూపొఫెసర్ గారపాటి ఉమామహేశ్వరరావు

Published date : 11 Dec 2020 05:48PM