ఏఎన్‌యూ పరిశోధకుడికి అంతర్జాతీయ గౌరవం
Sakshi Education
గుహల్లో జీవవైవిధ్యంపై పరిశోధనలు చేస్తున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) జంతుశాస్త్ర పరిశోధకుడు డాక్టర్ షాబుద్దీన్ షేక్కు అంతర్జాతీయ గౌరవం లభించింది.
స్విట్జర్లాండ్ కేంద్రంగా ప్రకృతిని, అందులోని వనరుల పరిరక్షణకు పనిచేస్తున్న ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్’ (ఐయూసీఎన్), ‘కేవ్ ఇన్‌వెర్టిబ్రేట్ స్పెషలిస్ట్ గ్రూప్’కు సేవలందించేందుకు షాబుద్దీన్ నియమితులయ్యారు. 35 దేశాల నుంచి 80 మంది వర్గీకరణ శాస్త్రవేత్తలను ఐయూసీఎన్ నియమించగా, మనదేశం నుంచి షాబుద్దీన్ ఒక్కరికే అవకాశం లభించింది. గుహల జీవవైవిధ్య అంశంపై ఆయన సమర్పించిన థీసిస్‌ను, స్పెయిన్ ప్రభుత్వం ఉత్తమ థీసిస్‌గా ఎడ్యుడికేట్ చేసింది.
Published date : 23 Apr 2019 06:03PM