ఏఐ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతిపై రూపొందించిన నివేదిక?
Sakshi Education
ఆధునిక ఐటీ సాంకేతికతలో భాగమైన కృత్రిమ మేధస్సు(ఏఐ) రంగంలో తెలంగాణ రాష్ట్రం 2020 ఏడాది సాధించిన విజయాలతో కూడిన ‘తెలంగాణాస్ ఇయర్ ఆఫ్ ఏఐ-2020 అండ్ బియాండ్’ అనే నివేదికను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు జనవరి 2న హైదరాబాద్‌లో విడుదల చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణాస్ ఇయర్ ఆఫ్ ఏఐ-2020 అండ్ బియాండ్ నివేదిక విడుదల
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : ఆధునిక ఐటీ సాంకేతికతలో భాగమైన కృత్రిమ మేధస్సు(ఏఐ) రంగంలో తెలంగాణ రాష్ట్రం 2020 ఏడాది సాధించిన ప్రగతిని తెలిపేందుకు
రాష్ట్రంలో ఏఐ విధానం అమలును వేగవంతం చేసేందుకు ‘తెలంగాణ ఏఐ మిషన్’(టీ-ఎయిమ్)ను ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
నివేదికలోని ముఖ్యాంశాలు...
- ఏఐ రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు 2020, జనవరి 2న రాష్ట్ర ప్రభుత్వం 2020ని ‘ఇయర్ ఆఫ్ ది ఏఐ’గా ప్రకటించింది.
- ‘ఏఐ ఫ్రేమ్‌వర్క్’ ఆచరణలోకి తెచ్చేందుకు నాస్కామ్ భాగస్వామ్యంతో ‘తెలంగాణ ఏఐ మిషన్’(టి ఎయిమ్) ఏర్పాటు చేసి ఆరు అంచెల వ్యూహాన్ని ప్రభుత్వం రూపొందించింది.
- ఆరోగ్య, రవాణా రంగాలపై దృష్టి కేంద్రీకరించేందుకు ఇంటెల్, ట్రిపుల్ ఐటీ (హైదరాబాద్), పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సహ భాగస్వామ్యంతో ‘ఏఐ పరిశోధన కేంద్రం’ఏర్పాటైంది.
- వ్యవసాయ, న్యాయ రంగాలపై ప్రాథమికంగా దృష్టి సారించేందుకు సెంటర్ ఫర్ ఫోర్ట్ ఇండస్ట్రియల్ రివల్యూషన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహకారంతో ‘సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ డిప్లాయ్‌మెంట్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్(క్రెడెట్)’ ఏర్పాటైంది.
- -వరల్డ్ ఎకనామిక్ ఫోరం సాయంతో ‘ఏఐ4ఏఐ’, అగ్రిటెక్ ఇన్నోవేషన్ పైలట్స్, అగ్రిడేటా హబ్, డ్రోన్ల ద్వారా క్రిమి సంహారకాల పిచికారీ వంటి కార్యక్రమాలు నిర్వహించింది.
- రాష్ట్రంలో ఏఐ వాతావరణాన్ని పెంపొందించేందుకు ఇంటెల్, ఎన్‌విడియా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, నాస్కామ్, ఐఐటీ వంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
- జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో ఆవిష్కర్తల కోసం అగ్రి డేటా హబ్‌ను నెలకొల్పింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణాస్ ఇయర్ ఆఫ్ ఏఐ-2020 అండ్ బియాండ్ నివేదిక విడుదల
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : ఆధునిక ఐటీ సాంకేతికతలో భాగమైన కృత్రిమ మేధస్సు(ఏఐ) రంగంలో తెలంగాణ రాష్ట్రం 2020 ఏడాది సాధించిన ప్రగతిని తెలిపేందుకు
Published date : 04 Jan 2021 05:49PM