ఏ పథకం కింద కోవిడ్ వారియర్స్‌కు కొత్త బీమా విధానం అమల్లోకి రానుంది?
Sakshi Education
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ(పీఎంజీకేపీ) కింద కోవిడ్–19 వారియర్స్‌కు 2021, ఏప్రిల్ 24వ తేదీ నుంచి కొత్త బీమా విధానం అమల్లోకి రానుంది.
ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ఏప్రిల్ 19న తెలిపింది. నిర్వహణలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఆరోగ్య కార్యకర్తల కుటుంబాలకు దీని ద్వారా రూ.50 లక్షలు అందుతాయి.
18 ఏళ్లు పైబడిన అందరికీ టీకా..
2021, మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కోవిడ్ టీకా వేసేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 45 ఏళ్లు పైబడిన వారికి ఎప్పటిలాగే ప్రభుత్వం ఉచితంగా వేస్తుంది. కానీ 18 ఏళ్ల నుంచి 45 లోపు వారికి నిర్ధిష్ట రుసుము చెల్లించడం ద్వారా టీకా వేసేందుకు ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇచ్చింది. తొలి విడతగా జనవరి 16, 2021 నుంచి ఆరోగ్య రంగ సిబ్బందికి, ఇతర ఫ్రంట్ లైన్ సిబ్బందికి టీకాకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అనంతరం మార్చి 20 నుంచి రెండో దశలో 45 ఏళ్లకు పైబడిన వారందరికీ టీకా ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది.

Published date : 20 Apr 2021 06:18PM