ఏ ప్రభుత్వ రంగ సంస్థలో భారత్ గ్యాస్ విలీనం కానుంది?
ఈ విలీన ప్రతిపాదనకు మార్చి 22న బీపీసీఎల్ బోర్డు ఆమోదముద్ర వేసింది. ప్రధానంగా గ్యాస్ కొనుగోలు, రిటైలింగ్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే బీజీఆర్‌ఎల్ ప్రస్తుతం బీపీసీఎల్‌కు 100 శాతం అనుబంధ సంస్థగా ఉంది. ఈ విలీనంతో కార్పొరేట్ స్వరూపాన్ని క్రమబద్ధీకరించడానికి వీలవుతుందని స్టాక్ ఎక్సే్చంజీలకు బీపీసీఎల్ తెలిపింది.
మూడో అతిపెద్ద ఎకానమీగా భారత్
భారత్ ఆర్థిక వ్యవస్థ 2031–32 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవర్భవిస్తుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఏ) సెక్యూరిటీస్ పేర్కొంది. నిజానికి 2028–29 ఆర్థిక సంవత్సరం నాటికే భారత్ ఈ స్థాయిని అందుకోవాల్సి ఉన్నప్పటికీ, కరోనా ప్రతికూలతలు భారత్ వృద్ధి వేగాన్ని అడ్డగించాయని వివరించింది. 2024–25 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవాలన్నది భారత్ లక్ష్యం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)లో విలీనం కానున్న సంస్థ?
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : భారత్ గ్యాస్ రిసోర్సెస్ (బీజీఆర్‌ఎల్)
ఎందుకు : కార్పొరేట్ స్వరూపాన్ని క్రమబద్ధీకరించడానికి వీలవుతుందని