ఏ ప్రాంతంలోని సరిహద్దుల్లో సైన్యం సొరంగ మార్గాన్ని గుర్తించింది?
Sakshi Education
జమ్మూలోని సాంబా సెక్టార్‌లో గాలార్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ వైపు వెళుతున్న 170 మీటర్ల పొడవైన ఒక సొరంగ మార్గాన్ని సరిహద్దు భద్రతా బలగాలు (బీఎస్‌ఎఫ్) కనుగొన్నాయి.
25 అడుగుల లోతు, 20 అడుగుల పొడవు, 3-4 అడుగుల వెడల్పున ఈ సొరంగ మార్గం ఉందని ఆగస్టు 29న సైన్యాధికారులు వెల్లడించారు. భారత్‌లోకి చొరబాట్లు, నార్కోటిక్ డ్రగ్‌స, ఆయుధాలు రవాణా చేయడం కోసమే పాకిస్తాన్ దీనిని నిర్మించిందని పేర్కొన్నారు. సరిహద్దుల నుంచి భారత్ భూభాగం వైపు 50 మీటర్ల దూరంలో ఈ సొరంగమార్గం ఉంది. ప్రస్తుతం బీఎస్‌ఎఫ్ డెరైక్టర్ జనరల్ రాకేశ్ ఆస్తానా ఉన్నారు.
చుషుల్‌లో చర్చలు...
సరిహద్దులోని తూర్పు లద్దాఖ్‌లో తాజాగా నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చేందుకు భారత్, చైనా మరో దఫా సైనిక చర్చలు చేపట్టాయి. సరిహద్దులో భారత్ వైపున్న చుషుల్‌లో సెప్టెంబర్ 1న బ్రిగేడ్ కమాండర్ స్థాయి అధికారుల చర్చలు ప్రారంభమయ్యాయి. పాంగాంగ్ సరస్సు వద్ద యథాతథ స్థితిని కొనసాగించాలన్న నిర్ణయానికి తూట్లు పొడుస్తూ ఆగస్టు 31న చైనా మిలిటరీ దుస్సాహసానికి దిగింది. పెద్ద సంఖ్యలో చైనా బలగాలు భారత్ వైపునకు చొచ్చుకొని వచ్చి దురాక్రమణకు యత్నించాయి.
అందుకే వివాదాలు: చైనా మంత్రి
భారత్, చైనా సరిహద్దులో ఒకవైపు ఉద్రిక్తతలు నెలకొనగా మరోవైపు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా సరిహద్దుల్ని ఇంకా నిర్ణయించలేదని, అందుకే ఎప్పుడూ సమస్యలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశ సరిహద్దుల్లో సొరంగ మార్గం గుర్తింపు
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : సరిహద్దు భద్రతా బలగాలు (బీఎస్‌ఎఫ్)
ఎక్కడ : గాలార్ ప్రాంతం, సాంబా సెక్టార్, జమ్మూ

Published date : 02 Sep 2020 05:30PM