ఏ పక్షి ఆకారంలో జయలలిత స్మారక మండపాన్ని నిర్మించారు?
Sakshi Education
చెన్నై మెరీనాబీచ్‌లో నిర్మించిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్మారక మండపాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి జనవరి 27న ప్రారంభించారు.
ఫినిక్స్ పక్షి ఆకారంలో రూ.80 కోట్లతో ఈ సమాధి స్మారాక మండపాన్ని నిర్మించారు. ఈ మండప రూపకల్పన(డిజైన్)ను ఐఐటీ మద్రాసు తయారు చేసింది. నిర్మాణానికి మూడేళ్లకు పైగా సమయం పట్టింది. జయలలిత సమాధిపై తమిళంలో, ఇంగ్లీషులో ‘బై ద పీపుల్-ఫర్ ద పీపుల్’ అని అమర్చారు.
2016 డిసెంబర్ 5న... జయలలిత కన్నుమూయగా ఆమె పార్థివదేహాన్ని చెన్నై మెరీనాబీచ్‌లో ఎంజీ రామచంద్రన్ స్మారక మండపం వెనుకవైపున ఖననం చేసి సమాధి నిర్మించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్మారక మండపం ప్రారంభం
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి కె. పళనిస్వామి
ఎక్కడ : మెరీనాబీచ్, చెన్నై, తమిళనాడు

Published date : 29 Jan 2021 04:49PM