ఏ నగరంలో నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఎల్‌బీ శాస్త్రి ట్రస్టు ప్రకటించింది?
సింగపూర్‌కు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) భాగస్వామ్యంతో ఈ సంస్థను నిర్వహిస్తామని ట్రస్టు చైర్మన్, ఎల్‌బీ శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రిఆగస్టు 17న ప్రకటించారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు విద్యారంగంలో ఆవిష్కరణలకు ప్రభుత్వం అందిస్తున్న చేయూతను దృష్టిలో పెట్టుకొని ఈ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాలకు చెందిన విద్యార్థులు, యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కోసం వివిధ కోర్సులను ఈ సంస్థ ద్వారా అందిస్తామని తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి :హైదరాబాద్ నగరంలో నైపుణ్యాభివృద్ది సంస్థ (స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్)ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు17
ఎవరు :మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పేరిట ఏర్పాటైన ఎల్‌బీ శాస్త్రి ట్రస్టు
ఎక్కడ :హైదరాబాద్
ఎందుకు :తెలంగాణరాష్ట్రంలో వివిధ రంగాలకు చెందిన విద్యార్థులు, యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కోసం...