Skip to main content

ఏ మిస్సైల్‌ను విదేశాలకు ఎగుమతి చేయాలని భారత్ నిర్ణయించింది?

దేశీయంగా తయారు చేసిన ఆకాశ్ మిస్సైల్ వ్యవస్థను విదేశాలకు ఎగుమతి చేసేందుకు భారత ప్రభుత్వం డిసెంబర్ 30న అనుమతినిచ్చింది.
Current Affairs
ఈ మేరకు ఆకాశ్ మిస్సైల్స్‌ను కొనేందుకు తయారుగా ఉన్న దేశాల ప్రతిపాదనలు పరిశీలించి వేగంగా అమ్మకాల అనుమతులిచ్చేందుకు వీలుగా ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఆకాశ్ మిస్సైల్ 25 కిలోమీటర్ల రేంజ్‌లో టార్గెట్‌ను విజయవంతంగా ధ్వంసం చేయగలదు.

కాస్త భిన్నంగా...
ఆకాశ్ మిస్సైల్స్‌ను విదేశాలకు విక్రయించేందుకు కేంద్ర కేబినెట్ డిసెంబర్ 30న ఆమోదం తెలిపిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. అయితే విదేశాలకు ఎగుమతి చేసే ఆకాశ్’ వ్యవస్థ... ప్రస్తుతం భారత దళాలు ఉపయోగిస్తున్న దానితో పోలిస్తే భిన్నంగా ఉంటుందని తెలిపారు. ఈ నిర్ణయంతో ఆయుధాల విక్రయాల్లో భారత్ విదేశాలతో పోటీ పడే అవకాశం కలుగుతుందన్నారు. 2024నాటికి 101 రకాల ఆయుధాలను, మిలటరీ ప్లాట్‌ఫామ్స్‌ను దిగుమతి చేసుకోవడం నిలిపివేసి స్వదేశీవి తయారు చేసుకోవాలని భారత్ భావిస్తోంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఆకాశ్ మిస్సైల్ వ్యవస్థను విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతి
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : ఆయుధాల విక్రయాల్లో భారత్ విదేశాలతో పోటీ పడేందుకు
Published date : 31 Dec 2020 06:07PM

Photo Stories