ఏ జిల్లాను విభజించి విజయనగర అనే కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు?
బళ్లారి నుంచి హొసపేట సహా పలు అసెంబ్లీ నియోజ కవర్గాలను వేరుచేసి విజయనగర అనే కొత్త జిల్లాను ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫిబ్రవరి 8న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో 31వ జిల్లాగా విజయనగర అవతరించింది. కొత్త జిల్లాలో హొసపేటే (విజయనగర), కూడ్లిగి, హగరి బొమ్మనహళ్లి, కొట్టూరు, హువిన హడ గలి, హరపనహళ్లి తాలూకాలను చేర్చారు.
కర్ణాటక రాష్ట్ర రాజధాని: బెంగళూరు
కర్ణాటక ప్రస్తుత గవర్నర్: వాజుభాయ్ రుడాభాయ్ వాలా
కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి: బీఎస్. యడియూరప్ప
విజయనగర సామ్రాజ్యం...
విజయనగర సామ్రాజ్యాన్ని నాలుగు రాజవంశాలు పాలించాయి. అవి.. సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశాలు. వీరి పరిపాలనా కాలంలో సాహిత్యం, వాస్తు శాస్త్రం, శిల్పం మొదలైన కళలు ఎంతగానో అభివృద్ధి చెందాయి. దీంతో విజయనగర రాజులకు చరిత్రలో ప్రముఖ స్థానం లభించింది.
వంశాలు పాలనా కాలం
సంగమ క్రీ.శ.1336 - 1485
సాళువ క్రీ.శ. 1486 - 1505
తుళువ క్రీ.శ. 1505 - 1570
అరవీటి క్రీ.శ. 1570 - 1646
క్విక్ రివ్యూ :
ఏమిటి : బళ్లారి జిల్లాను విభజించి విజయనగర అనే కొత్త జిల్లా ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ : బళ్లారి జిల్లా, కర్ణాటక
ఎందుకు : పరిపాలన సౌలభ్యం కోరకు