Skip to main content

ధ్రువ్ కార్యక్రమం ప్రారంభం

ప్రధానమంత్రి సృజనాత్మక అభ్యసన కార్యక్రమం ధ్రువ్(DHRUV)ను బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్ పొక్రియాల్ అక్టోబర్ 10న ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మెరికల్లాంటి 60 మంది విద్యార్థులను ఎంపిక చేసి, వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో 14 రోజులపాటు శిక్షణ అందిస్తామని చెప్పారు. దేశానికి దిశానిర్దేశం చేసేలా విద్యార్థులను తీర్చిదిద్దాలనే ప్రధాని నరేంద్ర మోదీ ఆశయానికి ప్రతిరూపంగా ఈ కార్యక్రమాన్ని ఆయన అభివర్ణించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ధ్రువ్(DHRUV) కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 10
ఎవరు : కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్ పొక్రియాల్
ఎక్కడ : ఇస్రో ప్రధాన కార్యలయం, బెంగళూరు
Published date : 11 Oct 2019 04:57PM

Photo Stories