ఢిల్లీ-కత్రా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
Sakshi Education
ఢిల్లీ-కత్రా (జమ్మూకశ్మీర్) మధ్య తొలిసారిగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమైంది.
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో అక్టోబర్ 3న కేంద్ర రెల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రైలును ప్రారంభించారు. మంగళవారం తప్ప వారంలో అన్ని రోజులు ఈ రైలు సేవలందిస్తుంది. అధునాతమైన సాంకేతికతతో తయారుచేసిన ఈ హైస్పీడ్ రైలు ఢిల్లీ-కత్రా మధ్య ప్రస్తుతమున్న 12 గంటల ప్రయాణ సమయాన్ని 8 గంటలకు తగ్గించనుంది. వందే భారత్‌కు మార్గమధ్యలో అంబాలా, లూథియానా స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం సందర్భంగా హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 కారణంగా ఇప్పటి వరకు నిలిచిన కశ్మీర్ అభివృద్ధి ప్రస్థానం, వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌తో తిరిగి మొదలయిందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఢిల్లీ-కత్రా (జమ్మూకశ్మీర్) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
ఎక్కడ : న్యూఢిల్లీ

Published date : 04 Oct 2019 05:41PM